అమెరికన్‌ పాపులర్‌ షోలో చరణ్.. పుత్రోత్సాహంతో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

అమెరికన్‌ పాపులర్‌ షోలో చరణ్.. పుత్రోత్సాహంతో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

Update: 2023-02-23 10:21 GMT

అమెరికన్‌ పాపులర్‌ షోలో చరణ్.. పుత్రోత్సాహంతో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

Ram Charan-Chiranjeevi: నిన్న మొన్నటిదాకా భారతదేశానికి మాత్రమే పరిమితమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాకింది. రాజమౌళి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి "నాటు నాటు" పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సాధించి ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మరొకసారి చూసేలాగా చేసింది.

తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ కు ఏబిసి (అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్) నిర్వహించే ఒక ప్రముఖ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా నుంచి రామ్ చరణ్ కు ఆహ్వానం వచ్చింది. బుధవారం నాడు రామ్ చరణ్ ఈ షో కి గెస్ట్ గా వెళ్లారు. 1975 నుంచి రన్ అవుతున్న ఈ ప్రముఖ షో కి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. మైకేల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోలో కనిపించిన మొట్టమొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు. ఇక ఈ షోలో మాట్లాడుతూ చరణ్ రాజమౌళి గురించి, నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అవ్వడం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

దీనికి సంబంధించిన ఒక వీడియోని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్టును పెట్టారు. "తెలుగు మరియు భారతీయ సినిమాకి ఇది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో కనిపించాడు. రాజమౌళి ఆలోచనలో పుట్టిన ఒక అద్భుతమైన ఐడియా ఇప్పుడు విజన్ గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది," అంటూ చిరంజీవి రామ్ చరణ్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఇక రామ్ చరణ్ విషయంలో చిరంజీవి తండ్రిగా చాలా గర్వపడుతున్నారని ఈ పోస్ట్ చూస్తే తెలుస్తుంది.


Tags:    

Similar News