Vakeel Saab Movie: వకీల్ సాబ్ సినిమాపై చిరు ప్రశంసలు
Vakeel Saab Movie: వకీల్ సాబ్ సినిమా పై మెగా స్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించాడు.
Pawan Kalyan: (File Image)
Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా పై మెగా స్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించాడు. శనివారం నాడు విడుదలైన వకీల్ సాబ్ సినిమాను తన కుంటుంబ సభ్యులతో కలసి చూశానని తెలిపారు. ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
'మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ అదే వేడి, అదే వాడి. ప్రకాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. సంగీత దర్శకుడు థమన్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ కపూర్ జీకి, డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగతా టీమ్ కి నా శుభాకాంక్షలు. అన్నింటికీ మించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు.. అందరి మనసుల్నీ గెలుస్తాడు' అని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, వకీల్ సాబ్ సినిమాకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ సినిమా విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పింక్ సినిమాకు తెలుగులో రీమేక్ గా పవన్ హీరోగా తెరకెక్కింది. దర్శకుడు వేణు శ్రీరామ్ పింక్ సినిమాలోని కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.