Chiranjeevi Tribute To Jaya Prakash Reddy : జయప్రకాశ్ రెడ్డి మృతి ; చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi Tribute To Jaya Prakash Reddy : తెలుగు ఇండస్ట్రీ మరో గొప్ప నటుడుని కోల్పోయింది. విలన్ గా, కమెడియన్ గా దాదాపుగా మూడు దశాబ్దాల పాటు

Update: 2020-09-08 05:41 GMT

chiranjeevi, jaya prakash reddy

Chiranjeevi Tribute To Jaya Prakash Reddy : తెలుగు ఇండస్ట్రీ మరో గొప్ప నటుడుని కోల్పోయింది. విలన్ గా, కమెడియన్ గా దాదాపుగా మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున అయన గుండెపోటుతో బాత్ రూమ్ లోనే కుప్పకూలి మరణించారు. అయన మరణ వార్తతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడుని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు అయనకి సంతాపం తెలుపుతున్నారు.

అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. " సీనియర్‌ నటుడు శ్రీ జయప్రకాష్‌ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాష్‌ రెడ్డి గారితో నేను ఆఖరిగా చేసింది ఖైదీ నెంబర్‌ 150.. సినిమాలో ఆయన గొప్ప నటుడు. "నాటకరంగం నన్ను కన్నతల్లి .. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి" అనేవారు. "అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకోనండి, స్టేజ్‌ మీద ఫర్పామెన్స్‌ ఇస్తుంటాను. మీరేప్పుడైనా రావాలి అని అడిగేవారు.

ఆ అవకాశాన్ని నేను పొందలేకపొయాను, సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అంటే మొదట గుర్తుకువచ్చేది జయప్రకాష్‌ రెడ్డి గారే. తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ సృష్టించుకున్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

జయప్రకాష్‌ రెడ్డి కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. నరసింహనాయిడు, సమరసింహారెడ్డి, రెడీ, కబడ్డీ, కబడ్డీ మొదలగు చిత్రాలు అయనకి మంచి పేరును తీసుకువచ్చాయి.  



Tags:    

Similar News