వేదాళం రీమేక్ : పవర్ స్టార్ ని మించిపోయేలా మెగాస్టార్ రెమ్యునరేషన్?

సైరా నరసింహ రెడ్డి లాంటి హ్యుజ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలను చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి..

Update: 2020-11-19 05:48 GMT

Megastar Chiranjeevi

సైరా నరసింహ రెడ్డి లాంటి హ్యుజ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలను చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. కరోనా వలన వాయిదా పడిన ఈ చిత్రం తాజాగా మొదలైంది.

అయితే ఈ సినిమా కోసం చిరంజీవి ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం నడుస్తుంది. ఇదే పెద్ద షాక్ గా ఉంటే తన తదుపరి చిత్రం వేదాళం రీమేక్ కు చిరు ఏకంగా 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఒకవేళ ఇది నిజం అయితే పవన్ కళ్యాణ్ ని చిరు రెమ్యునరేషన్ విషయంలో బీట్ చేసినట్టే.. ఎందుకంటే వకీల్ సాబ్ చిత్రానికి పవన్ కళ్యాణ్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇక మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సంక్రాంతి తరవాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్టుగా సమాచారం.

ఇక ఆచార్య సినిమా వచ్చేసరికి దేవాదాయ ధర్మదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ జరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో చరణ్ నటించనున్నాడు. ఈ సినిమా పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేయనున్నారు. అటు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

Tags:    

Similar News