Mega 157: టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన అనిల్‌ రావిపూడి

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న మెగా 157 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్‌ ఎప్పుడు బయటపడుతుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Update: 2025-08-19 15:20 GMT

Mega 157: టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన అనిల్‌ రావిపూడి

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న మెగా 157 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్‌ ఎప్పుడు బయటపడుతుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆగస్టు 22న ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘లిటిల్‌ హార్ట్స్’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఈ విషయంపై దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు.

హోస్ట్ అడిగిన ప్రశ్నకు – “ఈ నెల 21న టైటిల్‌ రిలీజ్ చేస్తారని వినిపిస్తోంది. నిజమేనా?” అని అడగగా, అనిల్‌ రావిపూడి “అది నిజమే” అని క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమాలో టైటిల్‌లో ‘సంక్రాంతి’ ఉండదని కూడా వెల్లడించారు.

ప్రస్తుతం మెగా 157 వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. “ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం”, “బాస్‌తో ఈ పండగ రఫ్ఫాడిస్తాం”, “మన శివ శంకర వరప్రసాద్‌ గారు” – వీటిలో ఏదో ఒకటి టైటిల్‌ అవుతుందని చిత్ర బృందం గతంలో సూచించింది. అయితే సంక్రాంతి అనే పదం లేదని అనిల్‌ చెప్పడంతో, చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్తో ముడిపడిన టైటిల్‌కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News