Meera Mitun: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటి మీరా మిథున్ అరెస్టు

Meera Mitun: చెన్నై కోర్టు ఇటీవల ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆమెపై దృష్టిపెట్టిన పోలీసులు, ఢిల్లీలో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-08-06 04:57 GMT
Meera Mitun: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటి మీరా మిథున్ అరెస్టు

Meera Mitun: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటి మీరా మిథున్ అరెస్టు

  • whatsapp icon

Meera Mitun: తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే కోలీవుడ్ నటి మీరా మిథున్ మళ్లీ హెడ్లైన్స్‌లోకి వచ్చారు. 2021లో ఎస్సీ, ఎస్టీ సంఘాలపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై కోర్టు ఇటీవల ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆమెపై దృష్టిపెట్టిన పోలీసులు, ఢిల్లీలో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ నెల 11న కోర్టులో హాజరుచేయాలంటూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు ఆదేశాలు ఇవ్వగా, ఇదే నేపధ్యంలో మీరాను అరెస్ట్ చేయడం జరిగింది. కాగా, మీరాను రక్షించేందుకు ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసులో మరింత మలుపు వచ్చి, ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పోలీసుల సాయంతో ఆమెను ప్రభుత్వ హోంలో ఉంచినట్లు సమాచారం.

వివాదాస్పద వీడియో, కేసుల వివరాలు:

2021లో మీరా మిథున్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఓ వీడియోలో షెడ్యూల్డ్ కులాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు దర్శకులు తన ఫోటోలు అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ, కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎస్సీ, ఎస్టీ వారిని తొలగించాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ వ్యాఖ్యలపై విదుతలై సిరుతైగళ్ పార్టీ నేత వన్నీ అరసు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మీరాపై ఐపీసీ సెక్షన్లు 153, 153A(1)(a), 505(1)(b), 505(2) మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.

అప్పట్లో మీరా మిథున్‌తో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్ అరెస్ట్‌య్యారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన ఈ జంట, కోర్టు విచారణలకు హాజరుకాలేదు. దీనిపై కోర్టు సీరియస్‌గా తీసుకుని వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచే మీరా మిథున్ పరారీలో ఉన్నారు.

బలమైన వ్యాఖ్యలు – అధికారులపై ఆరోపణలు:

తనపై అరెస్ట్ చేయడమంటేనే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మీరా మిథున్ గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లను ట్యాగ్ చేస్తూ వీడియోలు విడుదల చేసి, పోలీసులపై విమర్శలు, ఆరోపణలు చేశారు.

ఇప్పటికే కేసు పునఃప్రారంభం కావడంతో ఆమెను చెన్నైకి రప్పించి కోర్టులో హాజరు పరచే ప్రక్రియ మొదలైంది. ఆమె అరెస్ట్‌తో ఈ కేసు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.

Tags:    

Similar News