Raghu Rama Krishna Raju: 'మరువ తరమా' పెద్ద హిట్ అవుతుంది..!

Maruva Tarama: కొత్త దర్శకుడు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మరువ తరమా’.

Update: 2025-11-27 06:18 GMT

Raghu Rama Krishna Raju: 'మరువ తరమా' పెద్ద హిట్ అవుతుంది..!

Maruva Tarama: కొత్త దర్శకుడు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మరువ తరమా’. నవంబర్ 28న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజుతో పాటు, హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ కింద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ హీరోగా నటించగా, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా కథానాయికలుగా నటించారు.

ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు మాట్లాడుతూ, ‘మరువ తరమా’ మంచి విజయాన్ని సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. "డైరెక్టర్ చైతన్య వర్మ నాకు తెలుసు. ఇండస్ట్రీకి రావాలన్న తన ధైర్యాన్ని అభినందిస్తున్నాను. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. మరువ తరమా టీజర్, ట్రైలర్ నాకు బాగా నచ్చాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, డీఓపీ పనితీరు సూపర్. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కథ ఉంది. నారా రోహిత్, శ్రీ విష్ణు స్నేహబంధానికి ప్రతీక. వారిద్దరూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందం. ఈ చిత్రం జనం మెచ్చే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను." అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు అన్నారు.

చిత్ర దర్శకుడు చైతన్య వర్మ నడింపల్లి మాట్లాడుతూ.. ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. "ఈ ప్రయాణంలో మాకు ఎన్ని సవాళ్లు, సమస్యలు ఎదురైనా, వాటన్నింటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాం. సినిమా పూర్తవడం నాకు పెద్ద విజయంగా భావిస్తున్నాను. కేవలం డబ్బుల కోసమే కాకుండా, ఈ మూవీని చూసి నేను వ్యక్తిగతంగా సంతృప్తి చెందాను. ఈ మూవీ ఫలితాన్ని మీడియా మరియు ప్రేక్షకులకు వదిలేస్తున్నాను. అందరూ మా సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను." అని చైతన్య అన్నారు.

నవంబర్ 28న విడుదల కానున్న ‘మరువ తరమా’ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

Tags:    

Similar News