Raj Kaushal dies: గుండె పోటుతో నటి మందిరా బేడీ భర్త మృతి
Raj Kaushal dies: బాలీవుడ్ నటి, క్రికెట్ వ్యాఖ్యాత మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌషల్ (49) మరణించారు.
Mandira Bedi Husband Producer Raj Kaushal:(Twitter)
Raj Kaushal Dies: బాలీవుడ్ నటి, క్రికెట్ వ్యాఖ్యాత మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌషల్ (49) మరణించారు. ఆయన ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. రాజ్ కౌషల్ మరణవార్తను ధృవీకరిస్తూ నిర్మాత ఒనిర్ ట్వీట్ చేశారు. రాజ్ కౌషల్ 2005లో వచ్చిన మై బ్రదర్ నిఖిల్ అనే సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమయ్యారు. రాజ్ అంత్యక్రియలు దాదర్ శివాజీ పార్క్‌లో జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో హిందీ చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. చిత్ర సీమలో ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కౌషల్, మందిరా బేడి 1999 ఫిబ్రవరిలో పెళ్లిచేసుకున్నారు. ఈ జంటకు 2011లో మొదటి సంతానం కలిగింది. ఆ తర్వాత పోయిన సంవత్సరం ఓ బాలికను దత్తత తీసుకున్నారు. రాజ్ కౌషల్ సినీ నిర్మాతగానే కాకుండా.. రచయితగా మరియు దర్శకుడుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం. రాజ్ కాపీ రైటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 1998లో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన 800 వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించాడు.
నటుడిగా కెరీర్ ప్రారంభించి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు రాజ్ కౌషల్.. ఆ తరువాత అతను ప్యార్ మెయిన్ కబీ కబీ, షాదీ కా లడ్డూ, ఆంథోనీ కౌన్ హై వంటి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా మై బ్రదర్ నిఖిల్, షాదీ కా లడ్డూ ఇంకా ప్యార్ మెయిన్ కబీ కబీ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 90వ దశకంలో శాంతి టీవీ సీరియల్ ద్వారా హోమ్లీ కేరక్టర్ తో బుల్లితెరకు పరిచయమైన మందిరాబేడీ, ఆ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో ప్రభాస్ నటించిన 'సాహో'లో మందిరా కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.