Mamta Mohandas: ఒక హీరోయిన్ కోసం నాగార్జున గారి లాగా ఎవరు చేయరు..
Mamta Mohandas: ఒక హీరోయిన్ కోసం నాగార్జున గారి లాగా ఎవరు చేయరు..
Mamta Mohandas: ఒక హీరోయిన్ కోసం నాగార్జున గారి లాగా ఎవరు చేయరు..
Mamta Mohandas: 2005లో "మయూఖం" అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మమతా మోహన్ దాస్ "యమదొంగ" సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఆ తరువాత తెలుగులో కృష్ణార్జున, విక్టరీ, కథానాయకుడు, హోమం, చింతకాయల రవి, వంటి సినిమాలలో కనిపించి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన మమతా మోహన్ దాస్ ఆఖరి సారిగా తెలుగులో "కేడి" సినిమాలో కనిపించింది.
"కింగ్" సినిమాలో మమతా మోహన్ దాస్ తో కలిసి పని చేసిన నాగార్జున తన "కేడీ" సినిమాలో కూడా మమతా మోహన్ దాస్ కి ఒక మంచి పాత్ర ఇవ్వాలని అనుకున్నారట. కానీ ఆ ఆఫర్ ఇచ్చే సమయానికి మమతా మోహన్ దాస్ క్యాన్సర్ కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో తన ఆఫర్ రావడం గురించి చెప్పుకొచ్చింది.
"కేడీ సినిమా కోసం నాగార్జున సార్ నాకు కాల్ చేశారు. కానీ అప్పుడే నాకు క్యాన్సర్ ఉందని తెలియడంతో నేను సినిమాలు చేయలేనని చెప్పాను. వారం తరువాత నాగార్జున గారు మళ్ళీ కాల్ చేసి బాల్యంలో ఉండే సన్నివేశాలు తను పూర్తి చేసేస్తానని మిగతా సన్నివేశాలకి కలిసి పని చేద్దామని అన్నారు. నాకోసం డైరెక్టర్, నిర్మాత, మరియు నాగార్జున గారు ఆరు నెలల పాటు ఉండే నా కీమో సెట్టింగ్స్ కి ఇబ్బంది కలగకుండా నాలుగు రోజులు మాత్రమే పని చేసే విధంగా షెడ్యూల్ ని మార్చారు. కేవలం ఒక హీరోయిన్ కోసం నాగార్జున లాంటి సీనియర్ హీరో అలా చేయటం కేవలం ఆయన గొప్పతనం," అని నాగార్జున మంచితనం గురించి చెప్పుకొచ్చింది మమతా మోహన్ దాస్. గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె మలయాళం సినిమాలతో మాత్రం బాగానే బిజీగా ఉంది.