SSMB29: ఎస్ఎస్ఎంబీ29లో మహేష్ పేరు వైరల్.. ఇంతకీ పేరు ఏంటో తెలుసా..?
SSMB29లో మహేష్ పాత్ర గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
Mahesh Babu
SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో SSMB29 వర్కింగ్ టైటిల్ పేరుతో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఏ వార్త బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఏ చిన్న వార్త తెలిసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ షూట్‌లో మహేష్, ప్రియాంక చోప్రాతో పాటు నానా పటేకర్ పాల్గొన్నట్టు సమాచారం. ఇందులో నానా పటేకర్ మహేష్ తండ్రిగా నటించనున్నారని సమాచారం.
SSMB29లో మహేష్ పాత్ర గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ రుద్ర అనే పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఒడిశాలో మొదలైంది. ఇటీవల ఒడిశాలోని పలు అటవీ ప్రాంతాలను పరిశీలించిన రాజమౌళి.. కొరాపుట్ జిల్లాలో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించనున్నారని వార్తలు వినిపించాయి.
మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించడంతో ఇదే నిజమని తేలిపోయింది. ఈ నెల 28 వరకు తోలోమాలి, దేవ్ మాలి, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లో ఎంపిక చేసిన లొకేషన్లలో చిత్రీకరణ జరగనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తోలోమాలి పర్వతంపై ఇప్పటికే ప్రత్యేక సెట్‌ను వేశారు. కొద్ది రోజుల్లో మిగతా నటీనటులు షూట్‌లో పాల్గొననున్నట్టు సమాచారం.
ఈ చిత్రం కోసం గరుడ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పాన్ వరల్డ్ సినిమా కావడంతో ఇంగ్లీష్ టైటిల్ అయితే బాగుటుందని భావిస్తున్నట్టు సమాచారం. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.