Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమా నుంచి మొదటి పాట అప్పుడే అంటున్న థమన్
మహేష్ బాబు సినిమా కోసం రెండు మాస్ నంబర్లు అంటున్న థమన్
Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమా నుంచి మొదటి పాట అప్పుడే అంటున్న థమన్
Sarkaru Vaari Paata Songs: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఎస్.ఎస్.తమన్ పేరు ముందే ఉంటుంది. ఇప్పటికే దాదాపు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన థమన్ చేతిలో ఇంకా బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి "సర్కారు వారి పాట". సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ సినిమా మొత్తం మీద ఐదు పాటలు ఉండబోతున్నాయట. అయితే అందులో రెండు మాస్ పాటలు కావడం విశేషం.
ఇక ఈ సినిమాకి సంబంధించిన పాటలు అన్నీ పూర్తి అయిపోయాయని సినిమాలు చాలా మంచి ప్లేస్ లో ఆ పాటలు పెట్టారని తెలిపారు థమన్. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి మొదటి పాటని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా లో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.