నయనతారకు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్! నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

హీరోయిన్ నయనతారకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కాపీరైట్ దావాను కొట్టివేయాలంటూ కొద్దిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2025-01-28 10:28 GMT

నయనతారకు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్!.. నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

Nayanthara Documentary: హీరోయిన్ నయనతారకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కాపీరైట్ దావాను కొట్టివేయాలంటూ కొద్దిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపై విచారించిన కోర్టు నెట్‌ఫ్లిక్స్ పిటిషన్‌ను కొట్టివేసింది.

నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం నడుస్తోంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానుమ్ రౌడీ దాన్ మూవీ క్లిప్పింగ్స్ వాడుకున్నారు. అయితే తన పర్మిషన్ లేకుండా ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకున్నారని.. అందుకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధనుష్ కోర్టుకు వెళ్లారు. నయనతార దంపతులకు లీగల్ నోటీసులు పంపారు. ఇదే విషయమై నయనతార స్పందిస్తూ ధనుష్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. నయనతార వైఖరిని మరింత సీరియస్‌గా తీసుకున్న ధనుష్ తనకు నష్టపరిహారం కావాల్సిందేనని పట్టుపట్టారు.

ధనుష్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఈ క్రమంలోనే నయనతార దంపతులతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ధనుష్ చేసిన కాపీ రైట్ దావాను తిరస్కరించాలంటూ నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన నానుమ్ రౌడీ దాన్ సినిమా 2015లో విడుదలైంది. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నయనతార, విఘ్నేష్ ప్రేమలో పడ్డరు. ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు. నయన తార కెరీర్, ప్రేమ, పెళ్లి పై నెట్‌ఫ్లిక్స్ "నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్" అనే డాక్యుమెంటరీని రూపొందించింది.

తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుమ్ రౌడీ దాన్ సినిమా వీడియోలు, పాటలను ఇందులో చూపించాలని నయనతార దంపతులు భావించారు. ధనుష్ అనుమతి కోసం అడిగినప్పటికీ ఆయన ఇవ్వలేదని నయనతార ఆరోపిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ విడుదల కాగా.. అందులో సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల ఫుటేజ్ వాడుకోవడంపై ధనుష్ లీగన్ నోటీసులు పంపించారు. ధనుష్ పంపిన నోటీసులను సవాల్ చేస్తూ.. నెట్ ఫ్లిక్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మరి దీనిపై నయనతార ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News