Love Story: 10 ఓటీటీ ఆఫర్లు వచ్చిన థియేటర్స్ లోనే..

Love Story Movie: హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "లవ్ స్టోరీ" చిత్రం పూర్తయి..

Update: 2021-07-07 16:17 GMT

"లవ్ స్టోరీ" మూవీ పోస్టర్ 

Love Story Movie: హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "లవ్ స్టోరీ" చిత్రం పూర్తయి చాలా రోజులే అయిన కరోనా కారణంగా ఆ సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు కాస్త బ్రేక్ వేశారు. అయితే తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పాటు ఇటు తెలంగాణా లో సినిమా థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోపక్క ఆంధ్రాలో కూడా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్స్ నడుపుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో అప్పటివరకు ఓటిటి వైపు చూసిన పెద్ద సినిమాలు సైతం ఇప్పుడు సినిమా థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా లవ్ స్టొరీ సినిమా నిర్మాతలు తమకి వచ్చిన ఓటీటీ ఆఫర్ల గురించి చెప్పుకొచ్చారు.

సినిమా పూర్తి అయిన తర్వాత సినిమా హక్కుల కోసం 10 ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ నుండి ఆఫర్లు వచ్చాయని తెలిపారు. కరోనా సమయంలో ఓటీటీ వైపు వెళ్దామని ఆలోచించిన ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం "లవ్ స్టొరీ" చిత్రాన్ని సినిమా థియేటర్స్ లోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ అందించిన సంగీతానికి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. "ఫిదా" చిత్రం తర్వాత మరోసారి సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంచుకున్న శేఖర్ కమ్ముల ఈ చిత్రంతో మరో విజయాన్ని సాధించబోతున్నాడని సినీ వర్గాల టాక్. అమిగో క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ మరియు పుష్కర్ రామ్ మోహన్ రావులు నిర్మాతలుగా వ్యవహరించారు

Tags:    

Similar News