Lata Mangeshkar Death: గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత
Bollywood Singer: ప్రముఖ బాలీవుడ్ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు.
Lata Mangeshkar Death: గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత
Lata Mangeshkar Death: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా.
అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్ మీదే చికిత్స అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు లతా దీదీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఐసీయూలో ఉన్న ఆమెను వెంటిలేటర్‌కు తరలించారు. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన లతా మంగేష్కర్ చివరకు ఓడిపోయారు.