Allu Arjun: ఆకాశన్నింటి అంటుతోన్న బన్నీ, అట్లీ మూవీ అంచనాలు..
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా అల్లు అర్జున్ 22వ చిత్రంగా తెరకెక్కుతోంది.
Allu Arjun: ఆకాశన్నింటి అంటుతోన్న బన్నీ, అట్లీ మూవీ అంచనాలు..
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా అల్లు అర్జున్ 22వ చిత్రంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత చిత్రబృందం షూటింగ్ ప్రారంభించనుంది. మొదటి షెడ్యూల్‌ను ముంబయిలో ప్రారంభించబోతున్నారని సమాచారం. మూడు నెలల పాటు అక్కడే విస్తృతంగా షూటింగ్ జరగనుందని టాక్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకే ఈ షెడ్యూల్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది.
ముంబయి షెడ్యూల్ పూర్తయిన అనంతరం, చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ పనుల కోసం చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందనుందని టాక్. దీపికా పదుకొణె ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా నటించనున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. పునర్జన్మ వంటి కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మరి ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.