Kuberaa Twitter Review: కుబేరా మూవీ ట్విట్టర్ రివ్యూ

Kuberaa Twitter Review: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు.

Update: 2025-06-20 04:40 GMT

Kuberaa Twitter Review: కుబేరా మూవీ ట్విట్టర్ రివ్యూ

Kuberaa Twitter Review: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్లు అమెరికా, యూకేలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ సినిమాపై క్రిటిక్, నెటిజన్ల అభిప్రాయాలు, షార్ట్ రివ్యూల వివరాల్లోకి వెళితే..

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లాంటి యాక్టర్ల టాప్ క్లాస్ యాక్టింగ్‌తో ఉన్న పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ కుబేరా. ఈ సినిమాకు చూడటానికి ఎంగేజింగ్ స్టోరీ, క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణ. ధనుష్ పెర్ఫార్మెన్స్ చూసి అమీర్ ఖాన్ లాంటి వాళ్లు యాక్టింగ్ నేర్చుకోవాలి అని క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.


ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను చూస్తే.. కుబేర సినిమా చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఈ సినిమా జూన్ 20వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాలో నటించిన వారందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.


శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న కుబేరా సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడు చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా విషెస్ అంటూ సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశారు.



Tags:    

Similar News