కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి కన్నుమూత
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి సోమవారం తుదిశ్వాస విడిచారు.
కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి సోమవారం తుదిశ్వాస విడిచారు. జూలై 13న కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి బాధ ఇంకా తగ్గకముందే భార్య మరణం కుటుంబ సభ్యులతో పాటు సినీప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
తన నటజీవితంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, పిల్లల పెంపకం పూర్తిగా భార్యతో పాటు కుటుంబ సభ్యులే చూసుకున్నారని కోట అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. రుక్మిణి కూడా భర్త గురించి మాట్లాడుతూ ఆయన సహనం ఎక్కువగా ఉండేదని, అందరితోనూ సరదాగా గడిపేవారని పేర్కొన్నారు. కోట నటించిన చిత్రాల్లో ‘అహనా పెళ్లంట’ తనకు అత్యంత ఇష్టమైనదని ఒకసారి రుక్మిణి వెల్లడించారు.