ఎన్టీఆర్30 కోసం ముహూర్తం ఫిక్స్ చేసిన కొరటాల

Koratala Siva: ఎన్టీఆర్30 షూటింగ్ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ

Update: 2023-02-01 04:30 GMT

ఎన్టీఆర్30 కోసం ముహూర్తం ఫిక్స్ చేసిన కొరటాల

Koratala Siva: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. "ఆచార్య" సినిమాతో కరియర్లో మొట్టమొదటి డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో ఎలాగైనా మంచి ఫామ్ లోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కొరటాల శివ సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి ఆఖరిలో పట్టాలెక్కబోతోందట. వచ్చే నెలాఖరులో ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది జరగకపోతే మార్చ్ లో ఒక పెద్ద షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ శంషాబాద్ లో జరగబోతోంది.

ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శంషాబాద్ లో ఒక భారీ సెట్ ను కూడా నిర్మించే పనిలో పడింది. ఇక హైదరాబాదులో చేయాల్సిన షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం గోవాలో కొన్ని సన్నివేశాల షూటింగ్ ప్లాన్ చేస్తోంది. గోవా లో షెడ్యూల్ కూడా పూర్తయిన తర్వాత మళ్లీ హైదరాబాద్లోనే ఇంకొక షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ. మరి ఈ సినిమాతో కొరటాల శివ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News