Kondapolam Trailer: ఆకట్టుకుంటున్న కొండపొలం మూవీ ట్రైలర్..
Kondapolam Trailer: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కొండపొలం' ట్రైలర్ విడుదలైంది.
Kondapolam Trailer: ఆకట్టుకుంటున్న కొండపొలం మూవీ ట్రైలర్..
Kondapolam Trailer: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కొండపొలం' ట్రైలర్ విడుదలైంది. గిరిజన ప్రాంతం నేపధ్యంలో నడిచే కథాంశంతో మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన యువకుడిగా తేజ్.. ఆయన తండ్రి పాత్రలో సాయిచంద్, తాత పాత్రలో కోట శ్రీనివాస్ కనిపించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది.
'గొర్ల కాపరుల కుటుంబం..తల్లిదండ్రులకు చదువు లేదు..ఏ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్నారు..అని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన వైష్ణవ్ తేజ్ ను బోర్డు మెంబర్ నాజర్ అడుగగా..నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా' సార్ అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పే సంభాషణలతో ట్రైలర్ మొదలైంది. ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. క్రిష్ దర్శకుడు. రాజీవ్ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు.