Nikhil Siddharth: నిఖిల్ సినిమా మళ్లీ వాయిదా పడనుందా?
Nikhil Siddharth: యువ హీరో నిఖిల్ "కార్తికేయ 2" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు.
Nikhil Siddharth: నిఖిల్ సినిమా మళ్లీ వాయిదా పడనుందా?
Nikhil Siddharth: యువ హీరో నిఖిల్ "కార్తికేయ 2" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించిన కన్ఫ్యూషన్ అభిమానులను నిరాశ పరుస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 11న బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా మరియు యువ హీరో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించిన "లాల్ సింగ్ చద్దా" సినిమా విడుదల కు సిద్ధమవుతోంది. మరియు ఆగస్టు 12న నితిన్ హీరోగా నటించిన "మాచర్ల నియోజకవర్గం" సినిమా కూడా విడుదలకి రెడీగా ఉంది. ఇలా ఒకేరోజు రెండు సినిమాలు విడుదలవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని "కార్తికేయ 2" సినిమాని మరోసారి వాయిదా వేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆగస్టు 12న విడుదల తేదీ దొరకడమే చాలా కష్టమైందని నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సినిమాలను అందరూ పుష్ చేస్తున్నారని, తమ సినిమా విషయంలో కూడా అదే జరిగిందని, అక్టోబర్ లేదా నవంబర్ కి వెళ్లిపొమ్మని లేకపోతే తన సినిమా అసలు విడుదల అవ్వదని చాలామంది బెదిరించారని అన్న నిఖిల్ ఈ విషయంలో చాలా ఏడ్చానని కూడా చెప్పారు. నిర్మాతలు పట్టు పట్టి ఆగస్టు 12న వస్తున్నట్లుగా ప్రకటించారని అన్నారు నిఖిల్. ఒకే రోజున రెండు సినిమాలు విడుదలయితే అందులో ఏదో ఒక సినిమానే ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. కానీ ఈ డేట్ దాటితే మళ్ళీ నిఖిల్ సినిమాకి ఎప్పుడు విడుదల తేదీ దొరుకుతుందో చెప్పలేము. మరి ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందో లేదో వేచి చూడాలి.