Manchu Vishnu: ‘కన్నప్ప’ ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది
Manchu Vishnu: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది
Manchu Vishnu: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా పైరసీ బారినపడుతున్నదని, దీనిపై తాను తీవ్రంగా బాధపడుతున్నానని మంచు విష్ణు వెల్లడించారు. పైరసీని ప్రోత్సహించొద్దని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘‘‘కన్నప్ప’ సినిమా పైరసీకి గురైంది. మా టీమ్ ఇప్పటికే 30వేలకుపైగా అనధికారిక లింకులను తొలగించింది. కానీ ఈ విషయం ఎంతో బాధ కలిగిస్తోంది. పైరసీ అనేది దొంగతనమే. మనం పిల్లలకు దొంగతనం చేయొద్దని చెబుతాం కదా.. అలాంటప్పుడు ఇలా అనధికారికంగా సినిమాలు చూడడమూ దొంగతనంతో సమానమే. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. ‘కన్నప్ప’ను థియేటర్లలో లేదా అధికారిక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్ముల ద్వారా మాత్రమే చూసి, సినిమాను ఆదరించండి’’ అంటూ కోరారు.