Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు- కుమార్తె రమాదేవి

Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్యంపై ఆడియో వాయిస్‌ రిలీజ్ చేసిన కైకాల కుమార్తె

Update: 2021-11-23 08:48 GMT

కైకాల సత్యనారాయణ (ఫైల్ ఇమేజ్)

Kaikala Satyanarayana: సీనియర్ సినీ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నట్లు ఆయన కుమార్తె రమాదేవి వెల్లడించారు. కైకాల ఆరోగ్యంపై ఆడియో వాయిస్‌ను విడుదల చేశారు రమాదేవి. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని అందరితో మాట్లాడుతున్నారని తెలిపారామె. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. దయచేసి అనవసర వార్తలతో జనాలను ఆందోళన పరచవద్దన్నారు కైకాల కుమార్తె రమాదేవి.

Tags:    

Similar News