Jr NTR: మరొక బాలీవుడ్ ఆఫర్ అందుకున్న ఎన్టీఆర్

Jr NTR: క్రేజీ మల్టీ స్టారర్ సినిమా లో ఎన్టీఆర్

Update: 2023-04-26 14:01 GMT

Jr NTR: మరొక బాలీవుడ్ ఆఫర్ అందుకున్న ఎన్టీఆర్

Jr NTR: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా వీరి పై ఉన్న క్రేజ్ పెరిగిపోయింది. దీనితో తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి అభిమానులు వీరి తదుపరి సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ మధ్యనే ఎన్టీఆర్ కి బాలీవుడ్ నుండి పెద్ద ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న "వార్ 2" సినిమాలో తారక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలవ్వలేదు కానీ అప్పుడే ఎన్టీఆర్ కి మరొక బాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా ఒక క్రేజీ మల్టీ స్టారర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలుస్తోంది. అయితే ఆ బాలీవుడ్ హీరో ఎవరు? ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అని ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది.

Tags:    

Similar News