Jolly O Gymkhana OTT Release: హాట్ సమ్మర్‌లో కూల్ కామెడీ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్..!
Jolly O Gymkhana OTT Release: ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉన్న ‘జాలీ ఓ జింఖానా’ని మిస్ అవకుండా చూసేయండి!
Jolly O Gymkhana OTT Release: హాట్ సమ్మర్‌లో కూల్ కామెడీ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్..!
Jolly O Gymkhana OTT Release: కామెడీ వినోదాన్ని ఆస్వాదించేందుకు రెడీ అవ్వండి! ప్రభుదేవా (Prabhudeva) ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జాలీ ఓ జింఖానా’ (Jolly O Gymkhana) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఆహా (Aha) వేదికగా స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది.
శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఇప్పటికే తమిళంలో జనవరిలో థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కోలీవుడ్ ప్రేక్షకులను నవ్వులతో అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌గా నటించగా, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌ళీ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.
అనుకోని పరిస్థితుల్లో చనిపోయిన ఓ వ్యక్తిని బతికిఉన్నట్లుగా చూపించేందుకు ఓ కుటుంబం ఏం చేసిందన్న ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. వినోదంతో పాటు విచిత్రమైన పరిస్థితులను హ్యూమర్‌తో సమర్పించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ విభిన్న అనుభూతిని అందించనుంది. ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉన్న ‘జాలీ ఓ జింఖానా’ని మిస్ అవకుండా చూసేయండి!