Param Sundari: చర్చిలో రొమాంటిక్ సీన్స్‌పై క్రైస్తవ సంఘాల ఆగ్రహం – ‘పరమ్ సుందరి’పై కేసు డిమాండ్

దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ నటించిన తాజా చిత్రం పరమ్ సుందరి విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, తుషార్ జలోటా దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.

Update: 2025-08-14 11:45 GMT

ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో చర్చిలో చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్‌పై కొన్ని క్రైస్తవ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పవిత్రమైన ప్రార్థనా మందిరంలో ఇలాంటి సన్నివేశాలు చూపించడం అనుచితం అని, వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వాచ్‌డాగ్ ఫౌండేషన్ ఈ సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖలో,

“చర్చి పవిత్రమైన స్థలం. దానిని అసభ్యకర కంటెంట్‌కు వేదికగా చూపడం కాథలిక్ సమాజాన్ని కించపరచడమే. నిర్మాతలు, దర్శకులు, నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలి”

అని సంస్థ న్యాయవాది గాడ్‌ఫ్రే పిమెంటా పేర్కొన్నారు.

ఈ వివాదంపై పరమ్ సుందరి చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News