Rakul Preet Singh: రకుల్‌ను పెళ్లి చేసుకోబోయే జాకీ భగ్నానీ బ్యాక్ గ్రౌండ్ ఇదే..
Rakul Preet Singh: త్వరలో రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి పీటలెక్కనుంది.
Rakul Preet Singh: రకుల్‌ను పెళ్లి చేసుకోబోయే జాకీ భగ్నానీ బ్యాక్ గ్రౌండ్ ఇదే..
Rakul Preet Singh: త్వరలో రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి పీటలెక్కనుంది. జాకీ భగ్నానితో కలిసి నడుస్తున్నట్లు రకుల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో అసలు ఈ జాకీ భగ్నానీ ఎవరని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఆయన కొత్త ఏమో కానీ బాలీవుడ్ వారికి కాదు. జాకీ భగ్నానీ నటుడు, నిర్మాత. అతడు కోల్‌కతాలో 1984, డిసెంబరు 25న ఒక సింధీ కుటుంబంలో జన్మించాడు. ముంబై లోని హెచ్.ఆర్. కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి డిగ్రీని పూర్తి చేశాడు.
న్యూయార్క్ లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి యాక్టింగ్ కోర్సు కూడా చేశాడు. జాకీ భగ్నానీ.. 2009లో ఓ హిందీ మూవీలో ఇండస్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. 2016లో సరబ్జిత్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా కూడా తన అభిరుచి చాటుకున్నాడు. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్, రణ్ దీప్ హుడా కీ రోల్స్‌లో నటించారు. కాగా త్వరలో జాకీ భగ్నానీ అక్షయ్ కుమార్ హీరోగా, రకుల్ హీరోయిన్‌గా ఓ సినిమాను నిర్మించనున్నాడు.