గ్రామ వాలంటీర్లకు క్షమాపణ చెప్పిన హైపర్ ఆది

ఏపీలో గ్రామ వాలంటీర్లు పర్ ఫెక్ట్ గా చేస్తున్నారని.. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు.

Update: 2020-01-01 06:37 GMT
హైపర్ ఆది

ఏపీలో గ్రామ వాలంటీర్లు పర్ ఫెక్ట్ గా చేస్తున్నారని.. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు కమెడియన్ హైపర్ ఆది. ఈ సందర్బంగా గ్రామ వాలంటీర్లకు ఆది క్షమాపణ చెప్పారు. ఒక కార్యక్రమంలో తనకు తెలిసిన గ్రామ వాలంటీర్ పేరు చెప్పమంటే.. అది చెప్పే ప్రాసెస్ లో తప్పు చెప్పానని.. తన పక్కన ఉన్న అమ్మాయి తనకు తెలియక ఏదో చెప్పడంతో గ్రామ వలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడటం జరిగిందని.. ఆ అమ్మాయి తరుపున గ్రామ వాలంటీర్లను క్షమాపణలు కోరుతున్నట్టు హైపర్ ఆది పేర్కొన్నారు.

అంతేకాదు గ్రామ వాలంటీర్లు వారి జాబ్ పర్ ఫెక్ట్ గా చేస్తున్నారని కితాబిచ్చారు. కాగా హైపర్ ఆది పేరుకు జబర్దస్త్ లో మంచి కమెడియన్ అయినా పవన్ కళ్యాణ్ అంటే తనకి ప్రాణం అని చెబుతారు. జబర్దస్త్ లో చాలా స్కిట్ లలో పవన్ ను ఇమిటేట్ చేశాడు. కేవలం నటనే కాక అప్పుడప్పుడు జనసేన పార్టీ తరుపున జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గడిచిన ఎన్నికల్లో హైపర్ ఆది జనసేన పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.



Tags:    

Similar News