IT Raids: మైత్రి పై ఐటీ దాడులకు కారణం ఇదే..?
IT Raids: మరోసారి ఐటీ దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
IT Raids: మైత్రి పై ఐటీ దాడులకు కారణం ఇదే..?
IT Raids: మరోసారి ఐటీ దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగాయి. ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించి పన్ను ఎగవేశారన్న సమాచారంతో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మైత్రి బ్యానర్ నిర్మించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల విడుదలకు ముందు కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు.
టాలీవుడ్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అవతరించిన మైత్రీ మూవీ మేకర్స్ పై జరుగుతున్న ఈ దాడులు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల దాడులకు ప్రధాన కారణం మనీ లాండరింగ్ అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రాలకు సంబంధించి పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారట. ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అక్రమ సంపాదనను మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా సినిమాల్లో పెట్టుబడి పెట్టిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఏపీ వారు కాగా మరొకరు తెలంగాణ వారని అంటున్నారు.
మనీలాండరింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఐటీ అధికారులు మైత్రి సంస్థలపై దాడులు చేయగా తమ వద్ద అకౌంట్స్ ఖచ్చితంగా ఉన్నాయని..ఐటీ అధికారుల దాడులు సాధారణమంటూ మైత్రి మూవీ మేకర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇకపోతే, మైత్రి మూవీ మేకర్స్ సంస్థను 2015లో స్థాపించారు. మొదటి సినిమానే మహేష్ బాబు హీరోగా నిర్మించారు. మొదటి వెంచర్ శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే, ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో మైత్రి సంస్థ టాప్ పొజిషన్‌కు చేరింది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి భాగస్వామ్యులుగా మైత్రి సంస్థ ప్రారంభం కాగా మూడేళ్ల క్రితం మోహన్ చెరుకూరి వైదొలగగా, ప్రస్తుతం నవీన్, రవిశంకర్ కలిసి చిత్రాలు నిర్మిస్తున్నారు.