Nayanthara: పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలలో నటించనుందా..!?

* ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార.

Update: 2021-09-08 12:30 GMT

నయనతార - విగ్నేష్ శివన్ (ట్విట్టర్ ఫోటో)

Nayanthara: ఒకవైపు తెలుగులో మరోవైపు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఎప్పటికప్పుడు తన సినిమాలతో వార్తల్లో నిలిచే నయనతార అప్పుడప్పుడు తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రముఖ తమిళ దర్శకుడుతో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని, వారిద్దరూ చాలా తొందరగా తొందరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ సీక్రెట్ గా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరి గురించి కూడా చాలా పుకార్లు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.

అయితే పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాల్లో నటించనుందా అని అడిగితే ఖచ్చితంగా అవును అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత తన యాక్టింగ్ కెరీర్ ను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారట నయన్. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో నయనతార ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు. మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న ఒక మలయాళం సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా కనిపించనుంది.

Tags:    

Similar News