హిందీ "ఛత్రపతి" సంగతి ఏమైంది?

"ఛత్రపతి" రీమేక్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్

Update: 2022-01-26 04:15 GMT

"ఛత్రపతి" రీమేక్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్

Chatrapathi Hindi Remake: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో విడుదలైన ఛత్రపతి సినిమా బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు బెల్లంకొండ వి వి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందట. ఇంకా పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక పాట షూటింగ్ ఇవాళ మొదలుపెట్టింది చిత్ర బృందం.

ఛత్రపతి సినిమా కి కథని అందించిన విజయేంద్రప్రసాద్ హిందీ ప్రేక్షకులకి కూడా నచ్చే విధంగా స్క్రిప్టుని మార్చారు. వి.వి.వినాయక్ సినిమా లోని కొన్ని కీలక సన్నివేశాలలో మార్పులు కూడా చేశారని టాక్ నడుస్తోంది. ఒరిజినల్ సినిమా కంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలను ఫాస్ట్ గా నడిచే లాగా కథని మార్చారని కొన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు. పెన్ స్టూడియోస్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు మరి ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News