Kim Kardashian: అంబానీలు ఎవరో తెలియదు.. అయినా పెళ్లికి వచ్చా: నటి
Kim Kardashian Viral Comments: అంబానీ పెళ్లిలో ఆడి, పాడి అలరించింది కిమ్ కర్దాషియన్ . ఈ బాలీవుడ్ బ్యూటీ, మోడల్ అసలు అంబానీలు ఎవరో కూడా తెలియదట. తన ఫ్రెండ్ ద్వారా వారి పెళ్లికి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో తను కూడా పెళ్లికి వచ్చా అని చెప్పుకొచ్చింది.
Kim Kardashian: అంబానీలు ఎవరో తెలియదు.. అయినా పెళ్లికి వచ్చా: నటి
Kim Kardashian Viral Comments: కిమ్ కర్దాషియాన్ ఈ హాలీవుడ్ మోడల్ వైరల్ కామెంట్స్ చేసింది. అసలు పెళ్లికి వచ్చే ముందు వరకు తనకు అంబానీ అంటే ఎవరో తెలీదట. నా ఫ్రెండ్ జువెలరీ డిజైనర్ లారెన్స్ క్వార్జ్ కు అంబానీలతో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో తన వల్ల నాకు కూడా ఆహ్వానం అందిందని కిమ్ చెప్పింది. అంబానీలు పంపిన గిఫ్ట్ బాక్స్ బరువే ఏకంగా 20 కేజీలు ఉందట. ఆ గిఫ్ట్ బాక్స్‌లో నుంచి మ్యూజిక్ కూడా ప్లే అయింది. ఇక ఆ పెళ్లి పత్రిక చూసి మొత్తానికి ఫిదా అయిపోయాం. ఈ పెళ్లి కచ్చితంగా చూడాల్సిందేనని ఇండియాకు వచ్చాం అని కిమ్ చెల్లి ఖోలే కర్షాషియాన్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అనంత అంబానీ, రాధికలను ఆశీర్వదించడానికి ఈ అక్కాచెల్లెల్లు ఇద్దరూ లాస్ ఏంజెల్స్ నుంచి ముంబైకు లాంగ్ జర్నీ చేశారు.
రియాలిటీవి టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ గతేడాది జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో కిమ్ కర్దాషియాన్‌తో పాటు తన చెల్లి కోలే కర్దాషియాన్ కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లేహంగాలు ధరించారు. వాటిపై డైమండ్, ఎమరాల్డ్ జువెలరీ జత చేసి చాలా ఆకర్షణీయంగా కనిపించారు.
ముంబై వేదికగా జరిగిన ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులు సైతం వచ్చారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ పెళ్లికి వచ్చి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లిలో బాలీవుడ్ హీరోలు ఆడి పాడి అలరించిన వీడియోలు నెట్టింట ఆ మధ్య వైరల్ గా మారాయి.
అనంత్ రాధికల పెళ్లి జామ్ నగర్‌లో ప్రారంభమైంది. ఈ పెళ్లికి రిహన్నా పెర్పామెన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ లు కూడా ఆడి పాడారు. ఆ తర్వాత ప్రత్యేక క్రూజ్‌లో వెడ్డింగ్ గెస్టులను యూరప్ ట్రిప్ తీసుకెళ్లింది అంబానీ కుటుంబం.