Prabhas Adipurush : సోషల్ మీడియాలో ఆదిపురుష్ విలన్ రోల్ పై హాట్ ఇష్యూ!
Prabhas Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్
Hot issue on prabhas Adipurush movie villain role on social media
Prabhas Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెయిన్ లీడ్ లో 'ఆదిపురుష్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆఫీషియల్ గా వచ్చిన ప్రకటనతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
తాజాగా మేకర్స్.. ఈ మూవీలో విలన్ గా, రావణాసురుడు లంకేష్ రోల్ లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించనున్నట్లుగా వెల్లడించారు. గతంలో దర్శకుడు ఓం రౌత్ తొలి చిత్రం 'తానాజీ'లో కూడా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. వాస్తవానికి అదిపురుష్ లో ముందుగా విలన్ గా అజయ్ దేవగన్ ని తీసుకోవాలని మేకర్స్ భావించారు.. కానీ అయన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మేకర్స్ సైఫ్ అలీ ఖాన్ ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోల్స్ ఊపందుకున్నాయి. సైఫ్ అలీ ఖాన్‌ని తొలగించి వేరే యాక్టర్‌ని తీసుకోండంటూ కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఈ లిస్టులో మహానటి ఫేం కీర్తి సురేష్, బాలీవుడ్ భామ కీయరా అద్వానీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. కానీ దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2021లో మొదలు కానుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరవాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు ప్రభాస్..