Vijay Thalapathi: సినిమా కోసం జర్నలిస్ట్ గా మారిన తలపతి విజయ్

Vijay Thalapathi: గ్లోబల్ వార్మింగ్ పై గళం ఎత్తబోతున్న విజయ్

Update: 2021-09-28 13:33 GMT

విజయ్ తలపతి (ఫైల్ ఇమేజ్)

Vijay Thalapathi: ఈ మధ్యనే "మాస్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తలపతి విజయ్ తాజాగా ఇప్పుడు "మహర్షి" ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #తలపతి66 అని అభిమానులు ఈ చిత్రాన్ని పిలుస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ లో నుంచి ఈ సినిమా కోసం కొందరు స్టార్ టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే విషయం పై ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విజయ్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా కనిపించబోతున్నాడట. కానీ అడవులను నాశనం చేయటం ప్రకృతి వనరులని పాడు చేయడం చూసిన విజయ్ చలించి పోయి ఒక జర్నలిస్టుగా మారతారు. ఆపై గ్లోబల్ వార్మింగ్ కి పై ఆయన గళం ఎత్తబోతున్నారని సమాచారం. సినిమా మొత్తం చుట్టూ గ్లోబల్ వార్మింగ్ చుట్టూ సాగుతుందని సమాచారం. ఇక మరోవైపు విజయ్ "బీస్ట్" అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో విజయ్ ఒక మాస్ అవతారంలో కనువిందు చేయబోతున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News