Surya Fans Invite : సినిమాల్లో నటించింది చాలు.. రాజకీయాల్లోకి రండి!
Surya Fans Invite : తమిళనాడులో సినీ పరిశ్రమకి, రాజకీయాలకి మంచి అనుబంధం ఉందని చెప్పాలి.. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన జయలలిత
Hero surya fans invite to tamilanadu politics
Surya Fans Invite : తమిళనాడులో సినీ పరిశ్రమకి, రాజకీయాలకి మంచి అనుబంధం ఉందని చెప్పాలి.. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన జయలలిత లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవి అధిష్టించారు. రానున్న రోజుల్లో తమిళనాట రాజకీయాలు మరింతగా రసవత్తరంగా మారనున్నాయి.. ఇప్పటికే కమల్ హసన్, రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా హీరో సూర్యను కూడా రాజకీయాల్లోకి రండి అంటూ అభిమానులు కోరుతున్నారు.
అగరం ఫౌండేషన్ ద్వారా హీరో సూర్య చాలా సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక విపత్కర సమయంలోను సూర్య తన వంతుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సూర్య ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్ళు పూర్తి అయిన నేపధ్యంలో సూర్య అభిమానుల "సినిమాల్లో నటించింది చాలు.. రాజకీయాల్లోకి రండి" అంటూ ఓ పోస్టర్లని వదిలారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఇంకా సేవలను చేయలని కోరుతున్నారు. ఈ పోస్టర్ లో విప్లవ నాయకుడు చేగువేరా రూపంలో సూర్య ఫొటోలు పొందుపరిచి పక్కన తమిళనాడు సచివాలయం ఫొటోను పెట్టారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక సూర్య సినిమాల విషయానికి వచ్చేసరికి తాజాగా ఆకాశమే నీ హద్దురా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య.. ధియేటర్లు బంద్ కావడంతో ఓటీటీలోనే సినిమాని రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. గురు' ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది.