Prabahs Gift To Trainer : జిమ్ ట్రైనర్‌కు లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చిన ప్రభాస్!
Prabahs Gift To Trainer : మనకి సినిమాలో చాలా అందంగా ఫిట్ నెస్ గా కనిపించేందుకు మన హీరోలు చాలా కష్టపడుతుంటారు.. జిమ్ లో
Prabahs Gift To Trainer
Prabahs Gift To Trainer : మనకి సినిమాలో చాలా అందంగా ఫిట్ నెస్ గా కనిపించేందుకు మన హీరోలు చాలా కష్టపడుతుంటారు.. జిమ్ లో చెమటలు చిందిస్తారు. వారికోసం స్పెషల్ గా కొంతమంది ట్రైనర్లు కూడా ఉంటారు.. వారి ఇచ్చిన సూచనల మేరకు హీరోలు జిమ్ లో కష్టపడుతుంటారు. అందరిలాగే హీరో ప్రభాస్ కి కూడా స్పెషల్ గా ఓ ట్రైనర్ ఉన్నాడు. అతని పేరు లక్ష్మణ్ రెడ్డి.. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కి ట్రైనర్ గా పనిచేశాడు. అయితే తన కోసం చాలా కష్టపడుతున్న అతనికి ఓ బహుమతిని ఇచ్చాడు.. అయితే అది కూడా మామలు గిఫ్ట్ కాదండోయ్.. ఏకంగా లక్షలు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారుని తన ట్రైనర్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రభాస్.. ప్రభాస్ ఇలా గిఫ్ట్ లు ఇవ్వడం కొత్తేమి కాదు. గతంలో చాలా మందికి బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు ప్రభాస్..
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వచ్చేసరికి గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా తరవాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు ప్రభాస్.. ఈ సినిమాని వైజయంతి మూవీ సంస్థ నిర్మిస్తోంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమాని చేస్తున్నాడు ప్రభాస్.. దాదాపు 750 కోట్లతో ఈ సినిమా తెరకెక్కుతుంది.