Tuck Jagadish: థియేటర్స్ లో రిలీజ్ మాని.. ఓటీటీలో ఎందుకు "నాని"..!?

Update: 2021-08-17 11:09 GMT

"టక్ జగదీష్" (ట్విట్టర్ ఫోటో) 

Nani - Tuck Jagadish : "థియేటర్స్ వెంటనే ఓపెన్ చేయాలి.. థియేటర్స్ పై ఆధారపడి కొన్ని లక్షలమంది బతుకుతున్నారు..థియేటర్స్ యాజమాన్యాల మరియు డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలంటూ" ఈవెంట్స్ లో, సోషల్ మీడియాల్లో చిలుక పలుకులు పలికిన హీరోలు థియేటర్స్ తెరుచుకున్నాక మాత్రం వారి సినిమాల విడుదలకు ఓటీటీ వైపు మొగ్గు చూపడం తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. "సినిమా అంటే మన సంప్రదాయం, థియేటర్స్ లోకి వెళ్లి సినిమా చూడటం మన రక్తంలోనే ఉందని, అన్నింటికంటే ముందు థియేటర్స్ ని మూసి చివరికే థియేటర్స్ తెరుస్తారని" పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఇటీవల "తిమ్మరుసు" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫైర్ అయిన హీరో నాని తను నటించిన సినిమా రిలీజ్ సమయం వచ్చేసరికి థియేటర్స్ కష్టాలను మరిచి ఓటీటీ వైపు వెళ్ళిపోతున్నాడు.

"పెరుగుతున్న నిత్యావసర ధరలను, పెట్రోల్ రేట్లను గుర్తు చేస్తూనే పబ్బులు, రెస్టారెంట్ల కంటే సినిమా థియేటర్స్ చాలా సేఫ్" అని చెప్పిన ఆ నానినే "టక్ జగదీష్" సినిమాని ప్రముఖ ఓటీటీ సంస్థలో సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓటీటీ భారీగా ఆఫర్ చేయడంతో సినిమా థియేటర్స్ కష్టాలను నాని మరిచిపోయాడో లేదా పెరుగుతున్న నిత్యావసర ధరలను సైతం ప్రశ్నించిన నాని తన సినిమాకి సంబంధించిన నిర్మాతలను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ఒప్పించలేకపోయాడో తెలీదు కాని నాని తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ కి ప్రస్తుతం తను చేస్తున్న పనికి ఏ మాత్రం పొంతన లేదని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారని సమాచారం.         

Tags:    

Similar News