Hari Hara Veera Mallu: తగ్గిన టికెట్‌ ధరలు.. ఎప్పటి నుంచి అంటే?

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గించబడ్డాయి. జులై 28 నుంచి సాధారణ ధరలకే టికెట్లు లభ్యం. సింగిల్ స్క్రీన్ రూ.175, మల్టీప్లెక్స్ రూ.295కి అందుబాటులో!

Update: 2025-07-27 14:36 GMT

Hari Hara Veera Mallu: తగ్గిన టికెట్‌ ధరలు.. ఎప్పటి నుంచి అంటే?

హైదరాబాద్‌: పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరి హర వీరమల్లు’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రిష్‌, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 24న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ సాధించింది. పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్‌, నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

సాధారణ ధరలకే టికెట్లు

మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా టికెట్‌ ధరలను తగ్గించాలని చిత్ర బృందం నిర్ణయించింది. దీంతో జూలై 28 నుంచి ‘వీరమల్లు’ సాధారణ ధరలకే లభ్యం కానుంది. బుక్‌మైషో, డిస్ట్రిక్‌ యాప్‌లలో ఈ మార్పులు ఇప్పటికే అప్‌డేట్ అయ్యాయి.

కొత్త ధరలు ఇలా

సినిమా విడుదల సందర్భంగా సింగిల్‌ స్క్రీన్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ సోమవారం నుంచి సాధారణ ధరలకే విక్రయిస్తారు. సింగిల్‌ స్క్రీన్‌లలో బాల్కనీ రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Tags:    

Similar News