Pawan Kalyan: హమ్మయ్యా వీరమల్లు వచ్చేస్తున్నాడు.. అధికారికంగా విడుదల తేదీ ప్రకటన..!
Pawan Kalyan: పవ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది.
Pawan Kalyan: హమ్మయ్యా వీరమల్లు వచ్చేస్తున్నాడు.. అధికారికంగా విడుదల తేదీ ప్రకటన..!
Pawan Kalyan: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత పవన్ వెండి తెరపై కనిపించలేదు. అయితే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీని కంప్లీట్ చేశారు.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన "హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారైంది. జూన్ 12న ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు, పవన్ కళ్యాణ్ కత్తి పట్టిన ఓ మాస్ స్టిల్‌ను విడుదల చేసి అభిమానుల ఉత్కంఠకు చెక్ పెట్టారు.
దీంతో మరో 27 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఫ్యాన్స్ అప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. ఇలోపు టీజర్, ట్రైలర్ లాంచ్, పాటల విడుదల, ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా సమావేశాలు, ప్రచార కార్యక్రమాలన్నీ ముగించాల్సి ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్‌కు ప్రతీ వారం ఒక సర్‌ప్రైజ్ రానుందన్నమాట. అయితే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలతో బిజీగా ఉన్న పవన్ ప్రమోషన్స్‌లో పాల్గొంటారా.? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
అయితే పవన్ మాత్రం కచ్చితంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై నిర్మాత ఎ.ఎం రత్నంకు హామీ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా వెండి తెరపై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో 27 రోజులు వేచి చూడాల్సిందే.