Happy birthday Sonu Sood: మరోసారి పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్‌

Update: 2020-07-30 08:45 GMT

Happy birthday Sonu Sood: సోనూసూద్‌. రీల్ లైఫ్‌లో విలనే. కానీ లాక్‌డౌన్ సమయంలో రియల్‌ హీరోగా మారిపోయాడు. వేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించి రియల్ లైఫ్‌లో సుప్రీంహీరో అయ్యారు. వలస కూలీల కష్టాలకు చలించిపోయి సొంత డబ్బుతో వారిని ఇళ్లకు చేర్చి ప్రశంసలు పొందారు. అది అక్కడితో ఆగిపోలేదు. లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 1500 మంది విద్యార్థులను ఇండియాకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు స్పందించేలోపే బస్సులు ఏర్పాటు చేసి వారిని సొంత గూటికి పంపించారు. ప్రతీ వలస కార్మికుడు తమ ఇంటికి చేరే వరకు ఆగేది లేదు అనే సంకల్పంతో రంగంలోకి దూకాడు ఈ రియల్ హీరో. సోనుసూద్ ఈ రోజు 47 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తన బర్త్ డే సందర్భంగా మరో మంచి చేయాలని సోనూ సూద్ నిర్ణయించారు. దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందజేస్తానని తెలిపారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడిశాకు చెందిన పలువురు వైద్యులు దాదాపు 50 వేల మందికి వైద్య సేవలు అందిస్తారని వివరించారు. స్థానికి గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకొని శిబిరాలను నిర్వహిస్తామని అయితే సామాజిక దూరం పాటిస్తామని స్పష్టంచేశారు. సోనూ సూద్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags:    

Similar News