Happy Birthday Akkineni Nagarjuna : టాలీవుడ్ మన్మధుడికి పుట్టినరోజు జేజేలు!

Happy Birthday Akkineni Nagarjuna : అరవై సంవత్సరాలు వచ్చినా అమ్మాయిల మనసులో ఇంకా మన్మధుడు గానే ఉండాలంటే అది మామలు విషయం కాదు

Update: 2020-08-29 00:59 GMT

Happy Birthday Akkineni Nagarjuna

Happy Birthday Akkineni Nagarjuna : అరవై సంవత్సరాలు వచ్చిన అమ్మాయిల మనసులో ఇంకా మన్మధుడు గానే ఉండాలంటే అది మామలు విషయం కాదు కదా.. కానీ టాలీవుడ్ లో అది ఒక్క కింగ్ నాగార్జునకి మాత్రమే చెల్లింది .. అయన ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వ జన్మదిన వేడుకలను జరుపుకోబోతున్నారు . అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ్ విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.. ముఖ్యంగా ప్రేమకథలకు స్పెషల్ హీరోగా నాగ్ పేరు సంపాదించుకున్నారు.. అయన కొడుకులు సినిమాల్లోకి వచ్చినప్పటికి మన్మధుడు 2 లాంటి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడంటే ఇంకా నాగ్ లో అ ప్రేమికుడు పోలేదనే కదా అర్ధం ... అయన పుట్టినరోజు సందర్భంగా నాగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాం ..

* అక్కినేని నాగార్జున ఆగష్టు 29, 1959న చెన్నైలో అక్కినేని నాగేశ్వర రావు, అన్నపూర్ణ దంపతులకి రెండవ కుమారుడుగా జన్మించారు.

* బాలనటుడుగా నాగార్జున సుడిగుండాలు చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1967లో విడుదలైంది.

* నాగార్జున మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.

* నాగార్జున 1984లో ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి నాగచైతన్య అనే కుమారుడు ఉన్నాడు.

* అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుందామని నాగార్జున ముందుగా అనుకున్నారు.. ఆ తరవాత హీరోగా 1986 లో విక్రమ్ సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన హిందీ మూవీకి రీమేక్

* ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి చిత్రం నాగార్జునకి నటుడుగా మంచి పేరును తీసుకువచ్చింది.

* 1989లో వచ్చిన శివ సినిమా నాగార్జున స్థాయిని, తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచింది. ఈ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక ఇదే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు నాగ్

* 1990 మొదటిభార్యకు లక్ష్మికి విడాకులు ఇచ్చి, 1992లో అమలను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి అఖిల్ జన్మించారు.

* ఇక ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్ సినిమా నాగ్ ని స్టార్ హీరోగా మార్చేసింది.

* నిన్నే పెళ్ళడతా సినిమాతో హీరోతో పాటుగా ప్రొడక్షన్ పనులను చూసుకుంటూ వచ్చారు నాగ్.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమాకి గాను ఏకంగా తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది.

* నిన్నే పెళ్ళడతా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరు ఉహించని విధంగా అన్నమయ్య లాంటి డివోషనల్ సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు నాగ్.. ఈ సినిమాతో నాగార్జున నటుడుగా మరో మెట్టు ఎక్కేశారు. ఈ సినిమాకి గాను నాగార్జున ఉత్తమ నటుడుగా నంది అవార్డు మరోసారి అందుకున్నారు.

* ఆవిడా మా ఆవిడే, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ఎదురులేని మనిషి మొదలగు సినిమాలు హీరోగా నాగార్జున స్థాయిని పెంచాయి..

* 2000 నుంచి 2002 మద్యలో నాగార్జున గ్రాప్ పడిపోయింది. చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి..

* ఇక 2002 లో వచ్చిన సంతోషం, మన్మధుడు సినిమాలు నాగర్జున గ్రాప్ ని పెంచాయి.. ఈ రెండు సినిమాలకి గాను నాగ్ కి నంది అవార్డులు లభించాయి.

* మళ్ళీ ఎవరు ఉహించని విధంగా శ్రీరామదాసు చిత్రాన్ని చేసి మంచి హిట్ కొట్టారు నాగార్జున.. ఇదే తరహాలో షిరిడి సాయి అనే సినిమాలో కూడా నటించి మెప్పించారు నాగార్జున.

* మనం సినిమాలో నాగ్ తన మొత్తం కుటుంబంతో కలిసి నటించాడు . ఇది తెలుగులో మరే హీరోకి కూడా ఇలాంటి ఘనత దక్కలేదు

* మొత్తం నాగార్జున ఇప్పటివరకు ఒక జాతీయ అవార్డు(అన్నమయ్య), 9 రాష్ట్ర నంది అవార్డులు మరియు 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.

*ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినీ హీరోగానే కాకుండా బడా నిర్మాతల్లో నాగార్జున ఒకరిగా నిలుస్తు వస్తున్నారు. అంతేకాకుండా మంచి బిజినెస్ మెన్ గా కూడా నాగార్జునకి మంచి పేరుంది.

* సినిమాలు కాకుండానే ముంబై మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కి సునీల్ గవాస్కర్ తో కలిసి భాగస్వామిగా వ్యవహరించారు

* HIV / AIDS అవగాహన కార్యక్రమాలకు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు .

* వెండితెర పైన కాకుండా బుల్లితెర పైన కూడా నాగార్జున అదరగొట్టారు.. మీలో ఎవరు కోటిశ్వరరుడు, బిగ్ బాస్ షోలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి.  


నాగార్జున ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నాగ్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ అందిస్తుంది HMTV


Tags:    

Similar News