Hanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
ఒక్కసారిగా పెరిగిపోయిన హను రాఘవపూడి క్రేజ్
Hanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
Hanu Raghavapudi: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా "సీతారామం" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు సినిమాలు చూస్తారా లేదా అని ఇండస్ట్రీ సందిగ్ధంలో ఉండగా "సీతారామం" సినిమా కంటెంట్ బావుంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి తీరుతారని నిరూపించింది.
ఈ మధ్యకాలంలో ఒక అందమైన ప్రేమ కథ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం జరగలేదు. ఇలాంటి ఎన్నో విషయాలలో "సీతారామం" సినిమా ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అయ్యేలా చేసింది. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన హను రాఘవపూడి ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. నిన్న మొన్నటిదాకా అసలు ఆఫర్లే లేని హను రాఘవపూడి కి ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.
"పడి పడి లేచే మనసు" సినిమా తరువాత హను రాఘవపూడి కెరీర్ కు బ్రేకులు పడ్డాయి అనుకున్న వారు కూడా ఇప్పుడు "సీతారామం" సినిమా సక్సెస్ చూశాక ముక్కున వేలేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు హను రాఘవపూడి ముందు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఇక హను రాఘవపూడి తదుపరి సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.