Godzilla vs Kong: పైరసి ఎటాక్.. విడుదలైన తొలిరోజే ఆన్‌లైన్‎‌ల్లో..

Godzilla vs Kong: 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' ఇద్దరు యోధులు..ఒక్కరే విజేత అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు.

Update: 2021-03-24 11:34 GMT

Godzilla vs Kong

Godzilla vs Kong: 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' ఇద్దరు యోధులు..ఒక్కరే విజేత అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. ఈ మూవీ ఎట్టకేలకు బుధవారం (మార్చి 24, 2021)థియేటర్లలో సందడి చేసింది. 'వార్నర్‌ బ్రదర్స్'‌, లెజండరీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన హాలీవుడ్ మూవీ విడుదలైన అన్ని చోట్లు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మాన్స్టర్ వార్స్, కాంగ్- స్కల్ ఐలాండ్, గాడ్జిల్లా- కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్' చిత్రాల తర్వాత ఈ సీరిస్ నుంచి వస్తున్న నాలుగో సినిమా ఇది. భారతదేశంలో ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' మూవీకి ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, మిల్లీ బాబీ బ్రౌన్, రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, షున్ ఒగురి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ లెజెండరీ పిక్చర్స్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా టాక్ చాలా సానుకూలంగా ఉంది. అభిమానులు విజువల్ వండర్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ కావడంతో ప్రేక్షకులు తొలిరోజే భారీ సంఖ్యలో ధీయేటర్లకు క్యూ కట్టారు. ఏదేమైనా, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అభిమానులకు విచారకరమైన వార్త అందింది.

ఈ చిత్రం పైరసీ భూతం వెంటాడింది. రిలీజ్ అయిన తొలిరోజు పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. హిందీలో ఉన్న ఈ మూవీ తమిళ రాకర్స్, టెలిగ్రామ్, మోవియరుల్జ్ వంటి వాటిల్లో హెచ్డీ క్వాలిటీతో రిలీజ్ అయింది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ విడుదలైన మొదటి రోజు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ లీక్ బాక్సాఫీస్ వసూళ్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో నిర్మాతలు ఆందోళన వ్యాక్తం చేస్తున్నారు.

ఇలాంటి పైరిసీ సినిమాల వెబ్ సైట్లకు వ్యతిరేకంగా అనేక కఠినమైన చర్యలు తీసుకున్నమళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో తమిళ రాకర్స్ సైట్ నిషేదించినప్పటికీ ప్రతిసారీ సైట్ వెనుక ఉన్న బృందం క్రొత్త డొమైన్‌తో కనిపిస్తుంది. అవి నిషేధిస్తే, వారు క్రొత్త డొమైన్ తీసుకొని సినిమాల పైరేటెడ్ వెర్షన్లను నడుపుతున్నారు. ఇలాంటి వాటినిపై నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు. 

Tags:    

Similar News