Gaddar Film Awards: గద్దర్‌ సినీ అవార్డ్స్ 2014 : సెకండ్ బెస్ట్ ఫిల్మ్ 'పాఠశాల'

Gaddar Film Awards: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాలకు ప్రతిష్ఠాత్మక గద్దర్‌ సినీ పురస్కారాలను ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2014 గాను సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా 'పాఠశాల' చిత్రం ఎంపికైయింది.

Update: 2025-05-31 12:15 GMT

రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మాణంలో మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన 'పాఠశాల' ఐదుగురు మిత్రులు, ఐదు వారాలపాటు, 5000 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ, యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథ. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషంగా ఆదరణ పొందింది. ఇప్పుడు 2014 గాను సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా ప్రతిష్ఠాత్మక గద్దర్‌ సినీ అవార్డ్ కు ఎన్నికయ్యింది.

ప్రతిష్ఠాత్మక గద్దర్‌ ఫిల్మ్‌ పురస్కారాల్లో 2014 గాను సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా పాఠశాల చిత్రం ఎంపికకావడం పట్ల చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. 'పాఠశాల' చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మా చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోంది'అన్నారు.

Tags:    

Similar News