Hyderabad: మే డే సందర్భంగా సినీ కార్మిక మహోత్సవం

సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వాల ప్రోత్సహం బాగుంది : మెగాస్టార్ చిరంజీవి

Update: 2022-05-01 12:30 GMT

Hyderabad: మే డే సందర్భంగా సినీ కార్మిక మహోత్సవం

Hyderabad: సినీ పరిశ్రమ అభివృద్దికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారం భరోసా కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు మెగాస్టార్ చిరంజీవి. మేడే వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లో సిని కార్మికుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ తెలంగాణ కార్మిక, టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రులు హాజరయ్యారు. ఈసందర్భంగా కార్మికుల హక్కుల సాధన ఉద్యమ స్పూర్తిని వారు స్మరించుకున్నారు. ఈసందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో తానూ ఓ కార్మికుడినేనన్న ఆయన ఇండస్ట్రీ అభివృద్దికి ప్రభుత్వాలు సహకరిస్తున్న తీరు అభినందనీయం అన్నారు. సీఎం కేసీఆర్, జగన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరగాలన్నారు.

Tags:    

Similar News