Esha Gupta: హార్దిక్ పాండ్యతో డేటింగ్ వార్తలపై ఎట్టకేలకు స్పందించిన ఇషా గుప్తా!
Hardik Pandya: బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
Esha Gupta: హార్దిక్ పాండ్యతో డేటింగ్ వార్తలపై ఎట్టకేలకు స్పందించిన ఇషా గుప్తా!
Hardik Pandya: బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కొన్నేళ్ల క్రితం టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో తాను డేటింగ్‌లో ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై ఆమె తాజాగా స్పందించారు. నిజానికి తమ మధ్య కొంతకాలం స్నేహం కొనసాగిందని, కానీ అది డేటింగ్ దశలోకి వెళ్లలేదని తేల్చేశారు.
"కొన్ని నెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా మధ్య స్నేహం ఏర్పడింది. అయితే, డేటింగ్ దశకు మేము వెళ్లలేదు. రెండు, మూడుసార్లు కలిశాం. మొదట మాటలు మొదలైనప్పుడు రిలేషన్‌గా మారుతుందేమో అనిపించింది. కానీ ఆలోచించినంత కాలం కొనసాగలేదు. మేమిద్దరం విడిపోయాం" అని ఇషా పేర్కొన్నారు.
అలాగే ‘కాఫీ విత్ కరణ్’ షోలో హార్దిక్ పాండ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు. "ఆ సమయంలో మేమిద్దరం కలసి లేరు కాబట్టి, ఆయన వ్యాఖ్యలు నన్ను ఏమాత్రం బాధించలేదు" అని చెప్పారు.
దర్శకుడు సాజిద్ ఖాన్‌తో తనకు గతంలో మనస్పర్థలు జరిగినట్లు కూడా ఇషా గుర్తుచేసుకున్నారు. ‘హమ్‌షఖల్స్’ సినిమా సమయంలో సాజిద్ తనతో అసభ్యంగా మాట్లాడాడని, దానికి తానే సమాధానం ఇచ్చినట్టు చెప్పారు.
"ఒకసారి సెట్‌లో నన్ను తక్కువగా మాట్లాడారు. నేనూ అలాగే బదులిచ్చాను. ఆ రోజు ఇంటికి వెళ్లిపోయా. నిర్మాత, సాజిద్ ఇద్దరూ క్షమాపణ చెప్పడంతో సినిమా పూర్తిచేశాను. ‘మీటూ’ ఉద్యమంలో నా పేరు ప్రస్తావించినా, నిజానికి ఆయన నాతో ఎప్పుడూ అసభ్యంగా వ్యవహరించలేదు" అని ఆమె వివరించారు.
బాలీవుడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఇషా గుప్తా, తెలుగులో ‘వీడెవడు’ చిత్రంలో కూడా నటించారు. ప్రస్తుతం మరో తెలుగు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.