Papa Movie: తెలుగులోకి వస్తున్న మరో తమిళ్ హిట్ మూవీ.. అంచనాలు పెంచేసిన ట్రైలర్..!
Papa Movie: కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ "డాడా" ఇప్పుడు "పా పా" పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.
Papa Movie: కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ "డాడా" ఇప్పుడు "పా పా" పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. గణేష్ కె బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ్ కోట తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 13న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మంగళవారం నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ చూశాను. చాలా హృద్యంగా ఉంది. ఇందులో హీరో-హీరోయిన్లతో పాటు చిన్నారి పాత్ర కూడా ప్రధానంగా అనిపిస్తోంది. ఇది మంచి ఎమోషన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రం. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. కొత్త నిర్మాత నీరజ్ కోట గారికి ఈ సినిమాతో మంచి గుర్తింపు రావాలి. అలాగే బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ‘అఖండ 2’ టీజర్ చూశాను. అభిమానులకు పండగ మొదలైంది అన్న ఫీలింగ్ వచ్చింది’’ అన్నారు.
దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ – ‘‘సురేష్ కొండేటి మంచి తమిళ సినిమాలను తెలుగులోకి తీసుకువచ్చారు. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ‘డాడా’ తమిళంలో 42 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో ‘పా పా’గా రాబోతోంది. పాటలు ఆకట్టుకున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది. ఈ మూవీ నిర్మాత నీరజ్ కోట గారికి మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అని చెప్పారు. మరి తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.