"శ్యామ్ సింగరాయి పార్ట్ - 2 ఈ హీరోతో నే చేస్తాను" అంటున్న రాహుల్

Shyam Singha Roy - 2: "పవన్ కళ్యాణ్ ఒక శ్యామ్ సింగరాయి"

Update: 2021-12-25 16:30 GMT

"శ్యామ్ సింగరాయి పార్ట్-2 ఈ హీరోతో నే చేస్తాను" అంటున్న రాహుల్

Shyam Singha Roy-2: "టక్ జగదీష్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తన ఆశలన్నీ "శ్యామ్ సింగారాయి" పైనే పెట్టుకున్నాడు. "టాక్సీ వాలా" ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మరియు మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటించారు. సాయి పల్లవి ఒక దేవదాసీ పాత్రలో కనిపించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలైంది.

అయితే చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న రాహుల్ సాంకత్యాయన్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా లో హీరోగా నాని కాకుండా ఇంకా ఎవరైతే బాగుంటుంది అని అడగగా రాహుల్ సాంకృత్యాయన్ వెంటనే పవన్ కళ్యాణ్ అని అన్నారు. "పవన్ కళ్యాణ్ గారు డిఫాల్ట్ గానే ఒక శ్యామ్ సింగరాయి.

ఇలాంటి ఒక పాత్ర పడి ఉంటే, ఆయనకి ఉన్న స్ట్రెంత్ కి, ఫ్యాన్ బేస్ కి పగిలిపోయేది. ఒకవేళ శ్యామ్ సింగరాయి పార్ట్ 2 తీసే ఆలోచన వస్తే పవన్ కళ్యాణ్ గారితోనే తీస్తా అని అంటున్నాడు రాహుల్ సాంకృత్యాయన్. మరోవైపు శ్యామ్ సింగరాయి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ లు నమోదు చేసుకుంటోంది.

Tags:    

Similar News