Sirivennela Sitaramasastri: స్టార్ దర్శకుడిపై అలిగిన సిరివెన్నెల సీతారామశాస్త్రి
Sirivennela Sitaramasastri: సిరివెన్నెల నామీద అలిగారు అంటున్న క్రిష్
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరియు క్రిష్ (ఫైల్ ఇమేజ్)
Sirivennela Sitaramasastri: టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రొటీన్ సినిమాలకు కు దూరంగా విభిన్నంగా కొత్త కథా కథనాలతో సినిమాలు తీయడంలో దిట్ట. ఇప్పటికే కొన్ని సూపర్ హిట్ సినిమాలను మనకు అందించిన క్రిష్ తాజాగా తన గురువు అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ వారి ఇద్దరి మధ్య బంధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకసారి తనపై అలిగారు అని ఆ సందర్భం గురించి వివరించారు దర్శకుడు క్రిష్. "కృష్ణం వందే జగద్గురుం" సినిమా. సీతారామ శాస్త్రి క్రిష్ కోసం దర్శకత్వం వహిస్తున్న "కృష్ణం వందే జగద్గురుం" సినిమా కోసం ఒక 14 నిమిషాల పాట రచించారట.
ఈ విషయాన్ని స్వయంగా క్రిష్ ప్రేక్షకులతో పంచుకోగా, "ఇప్పుడైతే ఒప్పుకునే వాడినేమో కానీ అప్పుడు నాకు దర్శకుడిగా తెలుగులో అది మూడవ సినిమా. అందుకే ఏదో ఒక అపనమ్మకం. నేను సినిమా చూస్తూ ఎడిటింగ్ గురించి ఆలోచిస్తున్నాను గురువుగారు ఏమో దాన్ని ఒక పాటలా మాత్రమే చూస్తున్నారు. అందుకే అందులో రెండు మూడు చరణాలు నేను వాడలేదు. దానివల్ల గురువు గారి మాట వినలేదని ఆయన నామీద అలిగారు" అంటూ చెప్పుకొచ్చారు క్రిష్ అయితే సినిమా అనేది మహా అద్భుతమైన వేదిక అని దాన్ని చాలా తక్కువ మంది వాడగలిగారు అని సిరివెన్నెలకి క్రిష్ కి కితాబిచ్చారు.