Ari Movie: అరి ఆ ఇద్దరికే అంకితం.. మనసు కదిలించే పోస్ట్ చేసిన డైరెక్టర్

Ari Movie: ఒక దర్శకుడికి తన సినిమా ఒక కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ప్రాణాన్ని పణంగా పెట్టి సినిమాను పూర్తి చేస్తారు.

Update: 2025-10-09 09:40 GMT

Ari Movie: ఒక దర్శకుడికి తన సినిమా ఒక కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ప్రాణాన్ని పణంగా పెట్టి సినిమాను పూర్తి చేస్తారు. అలాంటి కోవకే చెందుతారు దర్శకుడు జయ శంకర్. తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'అరి' కోసం ఏకంగా ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశారు.

'అరి' కథను సిద్ధం చేసుకునేందుకు ఏకంగా హిమాలయాల బాట పట్టిన జయ శంకర్, ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిసి, ఆశ్రమాల్లో గడిపారు. ఈ పరిశోధన ద్వారా అరి షడ్వర్గాలు (ఆరు అంతర్గత శత్రువులు) అనే, ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ మీద రాని ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌పై పట్టు సాధించి, మూడేళ్లు కష్టపడి కథను రాసుకున్నారు.

అయితే, నాలుగేళ్లు కష్టం తర్వాత అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'అరి' ప్రయాణంలో జయ శంకర్ తన జీవితంలోని రెండు ముఖ్యమైన స్తంభాలను కోల్పోయారు—తన ప్రాణానికి ప్రాణమైన తండ్రి (వంగ కనకయ్య) మరియు బావ (కె.వి. రావు).

తాజాగా జయ శంకర్ వేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి మనసుల్ని కదిలించింది. "రేపటి నుంచి అరి ఇక ఆడియెన్స్ సొంతం... ఈ ప్రయాణంలో నా జీవితంలోని మూల స్తంభాలైన మా తండ్రి గారు, బావ గారు మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను. 'అరి' చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను," అని పేర్కొన్నారు.


Tags:    

Similar News