షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్..

* పెళ్లి చేసుకోవద్దు అంటూ అజిత్ కి వార్నింగ్ ఇచ్చిన దర్శకుడు

Update: 2023-03-06 06:30 GMT

షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్..

Shalini Ajith: సెలబ్రిటీ జంటలకు మామూలుగానే క్రేజీ ఎక్కువగా ఉంటుంది. పైగా రీల్ లైఫ్ లో కలిసి నటించి రియల్ లైఫ్ లో వాళ్లు పెళ్లి చేసుకుంటే వారి జంట కి ఫాలోయింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కోలీవుడ్ లో అలాంటి ఒక సెలబ్రిటీ జంట అజిత్ మరియు షాలిని. వీరిద్దరి ప్రేమ కథ గురించి చెప్పాలంటే మనం ఒక 23 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అయితే వీరి పెళ్లి గురించి ఈ వార్తలు బయటకు వస్తున్న సమయంలో ఒక ప్రముఖ డైరెక్టర్ అజిత్ కి షాలినిని పెళ్లి చేసుకోవద్దు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటకు వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే 1999లో అమర్ కలం అనే సినిమాలో అజిత్ మరియు షాలిని జంటగా నటించారు. నిజానికి ఈ సినిమాలో నటించడానికి షాలిని నో చెప్పిందట కానీ అజిత స్వయంగా ఫోన్ చేసి ఆమెను బతిమాలి ఒప్పించారట. ఆ తర్వాత షూటింగ్ సమయంలో ఒకసారి అజిత్ వల్ల షాలినికి దెబ్బ తగిలిందంట. ఆ సమయంలో అజిత్ పలుసార్లు షాలినికి ఫోన్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారట.

ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా సమయంలో చిత్ర డైరెక్టర్ రమేష్ ఖన్నా అజిత్ కి వార్నింగ్ ఇచ్చారట. అందరూ మీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు ఆయన పట్టించుకోవద్దు అని ఆ డైరెక్టర్ చెప్పారట. దీంతో మరొక డైరెక్టర్ శరన్ కల్పించుకుని హీరోకి వార్నింగ్ ఇవ్వడమేమిటి అని రమేష్ పై విరుచుకుపడ్డారట. ఆ తర్వాత అజిత్ మరియు షాలినిల పెళ్ళికి డైరెక్టర్ రమేష్ వచ్చి ఆశీర్వదించి వెళ్లారట.

Tags:    

Similar News